Paatasala Registrations for 2022-2023 are closed
Parents and Teachers Orientation Videos
Click below links for Parents and Teachers Orientation
Parents Orientation Registration Orientation Message from Teachers Coordinator
పాఠశాల గురించి


2009 వ సంవత్సరంలో షార్లెట్ లో మొదలైన ఈ పాఠశాలలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో దాదాపుగా మూడు వందలకు పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. దాదాపుగా నలభై మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాఠాలు చెప్తున్నారు.
ఇది ఔత్సాహికులైన తల్లిదండ్రులు నడుం కట్టి పాఠాలు బోధిస్తూ నడిపిస్తున్న సంస్థ. పూర్తిగా ఆంగ్ల వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా పాఠ్యాంశాలు రూపొందించి తెలుగుమీద ఆసక్తి కలిగించడంలో కృతకృత్యులమయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు.
ఏ ఇద్దరి మధ్యైనా సత్సంబంధం ఉండాలంటే బాంధవ్యం ఒక్కటే సరిపోదు, అనురాగం ఉండాలి, దాన్ని తెలియజేసే భాష రావాలి. మనవళ్ళను, మనవరాళ్ళను చూడాలని, వారితో సంతోషంగా కాలం గడపాలని ఎంతో ఆశగా ఎదురుచూసే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల కోసం, వారి ఆప్యాయతను పిల్లలకు చవిచూపించాలనే తపనతోనూ మొదలైనదే ఈ పాఠశాల.
నేటి సమాజంలో మానవ సంబంధాలు మధ్య తెలియని అడ్డుగోడ కనిపిస్తోంది. మూసిన తలుపుల వెనక బిడియం రాజ్యమేలుతున్న రోజులివి. చెప్పగలిగే చనువు ఉన్నా తాము దూరమైపోతామేమోనన్న అభద్రతాభావంతో ఎవరూ ఏ పిల్లలకూ నీతులు చెప్పరు. నేటి విద్యా విధానంలోనూ నడవడిక ఆవశ్యకతను గుర్తించిన చిహ్నాలు లేవు. భవితకు ఇవన్నీ తెలియడానికి పాఠ్యాంశాలలో మంచి విషయాలు, సుభాషితాలు చేర్చడం జరిగింది.
మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలను పెంపొందించి, భవితను సన్మార్గంలో నడిపించడమే మా లక్ష్యం.
మీ ప్రాంతంలో తెలుగు నేర్పించాలనుకుంటే మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలందించడానికి పాఠశాల సిద్ధంగా వుంది. వివరాలకు admin@paatasalausa.org కు మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.
పాఠశాల గురించి
పాఠశాల గురించి
10వ వార్షికోత్సవ చిత్రాలు
3
పాఠశాల సిద్ధాంతాలు
భాష
భావం
భవిత
మా పాఠశాల బృందం

గురువంటే అందరికీ గురి!
విద్యా దానం అందించడంలో వారికి వారే సరి!
విద్యను మించిన లేదు సిరి!
విద్యా దానం అందించే గురువులందరికీ నమాస్సుమాంజలి మరొక్క పరి!!!
పాఠశాలను సంప్రదించండి
Charlotte, NC 28277

Teachers Group

Students

Graduates

Teachers Group